ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటి మనులలో  శిల్పా శెట్టి ఒకరు. ఈమె ఎక్కువ శాతం హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈమె తెలుగు లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగు లో ఈమె చాలా తక్కువ సినిమాల్లో నటించిన ఏ మూవీలతో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఈమె విక్టరీ వెంకటేష్ హీరో గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఈమె మోహన్ బాబు హీరో గా రూపొందిన వీడెవడండీ బాబు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన భలేవాడివి బాసు , ఆ తర్వాత నాగార్జున హీరోగా రూపొందిన ఆజాద్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇలా ఈమె కేవలం తెలుగులో నాలుగు సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ ఎక్కువ శాతం అద్భుతమైన క్రేస్ కలిగిన స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించింది. దానితో ఈమెకు తెలుగులో మంచి క్రేజ్ గుర్తింపు ఏర్పడింది. ఇప్పటికి కూడా శిల్పా శెట్టి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే శిల్ప శెట్టి చెల్లెలు తెలుగులో ఓ సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఇంతకు శిల్పా శెట్టి చెల్లెలు ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె పేరు  షమితా శెట్టి. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన పిలిస్తే పలుకుతా అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ఆకాష్ హీరో గా నటించాడు. ఈ మూవీ తర్వాత ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ms