
కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ చివరి సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజయ్ చివరి సినిమా అని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలను సృష్టిస్తుండటం గమనార్హం.
అయితే సినిమాల్లో హీరో అయినా విజయ్ రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోనున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒక స్థానంలో కూడా విజయం సాధించడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ పొలిటికల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతిభ చూపే ఛాన్స్ అయితే లేదని సమాచారం అందుతోంది.
విజయ్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదని చెప్పవచ్చు. సర్వే ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో విజయ్ ఏ విధంగా ముందడుగు వేస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. విజయ్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
విజయ్ పారితోషికం మాత్రం ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఉందని సమాచారం అందుతోంది. విజయ్ భవిష్యత్తులో కూడా సినిమాల్లో కొనసాగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు