
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తన అందం, అభినయం, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలతో పాటు యువహీరోలతోనూ వరుసగా ఛాన్స్‌లు అందుకుంటూ టాలీవుడ్‌లో తన క్రేజ్‌తో దూసుకుపోతోంది. హిట్ లేదా ఫ్లాప్ అనేది శ్రీలీలకు పెద్దగా మేటర్ కానట్టు కనిపిస్తోంది. అవకాశాలు వస్తే వాటిని వదలకుండా ఒకదాని తర్వాత ఒక సినిమాను చేస్తూ దూసుకుపోతుంది.
ఇప్పుడు ఈ తెలుగమ్మాయి బాలీవుడ్ బాట పట్టింది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల. ఈ సినిమా విడుదల కాకముందే మరొక భారీ హిందీ ప్రాజెక్ట్‌లో శ్రీలీలను లాక్ చేసుకున్నారని సమాచారం. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించబోయే సినిమాలో నాయికగా ఎంపిక అయినట్లు సమాచారం.
ఈ సినిమా ఎంతో స్పెషల్ అని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటించబోతున్నాడు.
రణ్‌వీర్ సింగ్ లాంటి మాస్ అండ్ క్లాస్ హీరో పక్కన శ్రీలీల హీరోయిన్‌గా అవకాశం పొందడం బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఇదే సరైన టైం అని చెప్పాలి. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ఆమె స్క్రీన్‌ప్రెజెన్స్‌తో పాటు డాన్సింగ్ స్కిల్స్ అదిరిపోతాయంటున్నారు. ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది సౌత్ హీరోయిన్స్‌కు అక్కడ పట్టు సాధించడం అంత ఈజీ కాదు. కానీ శ్రీలీల మాత్రం బాగా ప్లాన్ చేసుకుంటూ, మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించాలని ప్లానింగ్‌తో ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు