నితేష్ తివారి డైరెక్షన్లో రామాయణ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి అలరించబోతున్నారు. యష్ రావణుడి పాత్రలో,కాజల్ మండోదరి పాత్రలో చేస్తున్నారు.అలాగే సన్నీ డియోల్ హనుమంతుని పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా రామాయణ మూవీ కోసం రణబీర్ కపూర్ చేసిన పని గురించి ఓ దర్శకుడు బయటపెట్టారు. అదేంటంటే రామాయణ సినిమా కోసం రణబీర్ కపూర్ ఓ బయోపిక్ ని వదిలేసుకున్నారట.

మరి ఇంతకీ రణబీర్ కపూర్ ఎవరి బయోపిక్ ని వదిలేసుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ బసూ రణబీర్ కపూర్ కాంబినేషన్లో జగ్గా జాసూస్,బర్ఫీ వంటి రెండు హిట్ సినిమాలు వచ్చాయి. అయితే వీరి కాంబోలో మూడోసారి ఓ బయోపిక్ రాబోతున్నట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. అయితే ఈ బయోపిక్ కోసం అనురాగ్ బసూ రణబీర్ కపూర్ ని సంప్రదించగా.. ఆయన ముందు రెండు సినిమాలు ఉన్నాయని చెప్పారట. ఒకటి అనురాగ్ బసూ చెప్పిన కిషోర్ కుమార్ బయోపిక్.. మరొకటి రామాయణ.. అయితే ఈ రెండు సినిమాల్లో రణబీర్ కపూర్ రామాయణ సినిమాని ఎంచుకున్నారట. కిషోర్ కుమార్ బయోపిక్ ని వదిలేసుకున్నట్టు తాజా ఇంటర్వ్యూలో అనురాగ్ బసూ తెలియజేశారు. అనురాగ్ బసూ మాట్లాడుతూ..నేను చాలా రోజుల నుండి రణబీర్ కపూర్ తో మరో సినిమా తీయాలని ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేశాను.

కానీ రణబీర్ ఎప్పుడు కూడా తన జీవితంలో నిజాయితీ గానే ఉంటారు. అలా కిషోర్ కుమార్ బయోపిక్, రామాయణ రెండు సినిమా ఆఫర్స్ వచ్చిన తరుణంలో ఆయన రామాయణ మూవీనే ఎంచుకున్నారు. అలా నేను చెప్పిన బయోపిక్ ని రిజెక్ట్ చేశారు అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అనురాగ్ బసూ. అలాగే కిషోర్ కుమార్ బయోపిక్ లో అమీర్ ఖాన్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇది నిజమేనా అని ప్రశ్నించగా.. ఇప్పుడప్పుడే దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని లేదు.త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతాం. అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నాక సినిమాకి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతాం అంటూ అనురాగ్ బసూ తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: