ఏంటి మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ పెళ్లికి ముందే తల్లయ్యిందా.. నేను ఐశ్వర్యా రాయ్ కొడుకును అంటూ తెరమీదకి వచ్చిన ఈ అబ్బాయి ఎవరు.. ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నాడా.. ఇంతకీ అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో తమకు నచ్చిన వారితో డేటింగ్ లు చేస్తూ అప్పుడప్పుడు ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని బయటికి రాకుండా  అబార్షన్ లు చేయించుకుంటూ ఉంటారు.. కానీ కొంతమంది ఏమో పెళ్లిళ్లు చేసుకునే ఉద్దేశం ఉంటే పెళ్లికి ముందు తల్లైనా పిల్లల్ని కని ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు కూడా అనేకం ఉన్నారు. అయితే తాజాగా ఐశ్వర్యా రాయ్ గురించి ఒక సంచలన మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. 

ఏపీకి చెందిన యువకుడు నేను ఐశ్వర్యరాయ్ కొడుకును అని ఐశ్వర్యరాయ్ పెళ్లి కాకముందే ఆమె 15 ఏళ్ల వయసులోనే ఐవిఎఫ్ ద్వారా నేను ఆమెకి పుట్టాను అంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన సంగీత్ కుమార్ అనే యువకుడు తన ఫోన్లో ఉన్న చిన్నప్పటి ఫోటోలు చూపిస్తూ నేను ఐశ్వర్యా రాయ్ కొడుకుని అనడానికి ఇవే సాక్ష్యాలని ఐశ్వర్యా రాయ్ 15 ఏళ్ల వయసులోనే లండన్ లోని ఐవిఎఫ్  ద్వారా నన్ను కన్నది అంటూ ఒక సంచలన మ్యాటర్ బయటపెట్టారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.అయితే ఈ వీడియో ఇప్పటిదైతే కాదు.
గతంలోనే ఆ యువకుడు నేను ఐశ్వర్యా రాయ్ కొడుకును అంటూ మీడియా ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. పాత వీడియో మళ్లీ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమందేమో ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు అని అంటుంటే ఇంకొంతమంది ఏమో ఇది ఏప్రిల్ ఫస్ట్ అనుకున్నావా ఏప్రిల్ ఫూల్ చేయడానికి అనుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఓ పని చెయ్ నిన్ను ఐశ్వర్యా రాయ్ కొడుకని నమ్మాలంటే హాస్పిటల్ కి వెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అంటూ సిల్లీ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: