
దసరా ' నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14.22 కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.
హిట్ ది థర్డ్ కేస్ : నాని హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.91 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.
కింగ్డమ్ : విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.34 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వాసులు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.
ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నిర్వనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.87 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను చేస్తున్న సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.
లైగర్ : విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.57 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.