
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కూలీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు.ఇక ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో .. కింగ్ నాగార్జున కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా లో తన పాత్ర అభిమానులకు మంచి సర్ ఫ్రైజ్ ఇస్తుందని.. అందరికి నచ్చేలా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ పాత్రను డిజైన్ చేశాడని ఆయన తెలిపారు.
అంతే కాకుండా కూలీ సినిమా చూస్తే వంద భాషాలు చూసినట్లు ఉంటుందని .. అంత పవర్ ఫ్యాక్డ్ గా ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారని నాగ్ తెలిపారు. రజినీ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ ఫైర్ వర్క్స్ అని నాగ్ చెప్పడంతో ఈ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న హైప్ మరింత డబుల్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అదే రోజు ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ వార్ 2 సినిమా కూడా పోటీ గా రిలీజ్ అవుతుండడంతో ఈ మెగా క్లాస్ కోసం అందరూ ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు