టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన కృష్ణ మాస్టర్ పై తాజాగా పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపట్టుకు గురైంది. పోలీసులు సైతం కృష్ణ మాస్టర్ ను రిమాండ్ కి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరుపొందిన కృష్ణ మాస్టర్ గత నెలలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వగా ఒక మైనర్ బాలికపట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆ బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.


దీంతో కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పైన పోక్సో కేసు నమోదు అయినట్లుగా సమాచారం. ఈ కేసు నమోదు కావడంతో కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం వదిలిపెట్టకుండా విచారణ చేపట్టగా చివరికి  బెంగళూరులో తన అన్న ఇంట్లో నివాసం ఉంటున్నారని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణ కంది జైలుకి తరలించారు. ఇటివలె కొరియోగ్రాఫర్ కృష్ణకు ఒక మహిళతో కూడా వివాహం అయ్యింది.. ఇక తన భార్యకు సంబంధించి రూ.9.50 లక్షల రూపాయలు నగదు తీసుకొని వెళ్ళిపోయారని సమాచారం.


కృష్ణ మాస్టర్ గతంలో కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా చాలామంది యువతుల్ని, మహిళలని మోసం చేసినట్లుగా చాలా అభియోగాలు ఉన్నాయి. కృష్ణ డాన్స్ మాస్టర్ గా ఢీ షో పాల్గొనడమే కాకుండా సూపర్ జోడిలో రన్నర్ గా కూడా గెలిచారు. అలాగే డాన్స్ ఐకాన్ లో విన్నర్ గా కూడా గెలిచారు. మట్కా సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారి ఆ తర్వాత పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. ఈ మధ్యకాలంలో తరచు టాలీవుడ్ పరిశ్రమలు కొరియోగ్రాఫర్లకు సంబంధించి ఇలాంటి విషయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఇకమీదటైనా ఇలాంటివి జరగకుండా సిని పరిశ్రమ జాగ్రత్త పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: