తేజ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా చూడని వాళ్ళు ఉండరు. నితిన్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు.అయితే అలాంటి జయం సినిమాని మొదట చేయాల్సింది నితిన్ తో కాదు. అల్లు అర్జున్ తో.. అల్లు అర్జున్ గంగోత్రి సినిమా కాకుండా జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సిందట.కానీ చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించారట దర్శక నిర్మాతలు. ఇక విషయంలోకి వెళ్తే.. రైటర్ చిన్నికృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ జయం సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వాలి. అల్లు అరవింద్ గారు మాకు ఫోన్ చేసి నా కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలి అనుకుంటున్నాను అని చెప్పడంతోనే జయం సినిమాని బన్నీ కోసం అనుకున్నాం. అలా అశ్వినీ దత్ నిర్మాతగా తేజ డైరెక్షన్లో జయం సినిమాని ఫిక్స్ చేసుకున్నాం.

కానీ ఆ తర్వాత చివరి నిమిషంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మా సినిమాలో నితిన్ హీరో అంటూ అనౌన్స్ చేయడంతో అల్లు అర్జున్,అల్లు అరవింద్ చాలా ఫీలయ్యారు. అర్ధాంతరంగా సినిమా నుండి తీసేసారని బాధపడ్డారు. ఆ సమయంలో నేను గట్టిగా అనుకున్నా కచ్చితంగా అల్లు అర్జున్ కి హిట్ ఇవ్వాలి అని.ఇక అదే సమయంలో రాఘవేంద్రరావు 100వ సినిమా.. అందులో నా కొడుకే హీరో అని అల్లు అరవింద్ చెప్పడంతో ఆయన కోసం గంగోత్రి అనే మంచి కథ రాశాను. జయం సినిమా చేయకపోయినా గాని గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకి గంగోత్రి సినిమాతో నేను మంచి హిట్ ఇచ్చాను అనే సంతృప్తి నాలో ఉంది. గంగోత్రి సినిమా పశ్చిమగోదావరిలో ఇంద్ర సినిమా కలెక్షన్స్ ని దాటింది.అంతేకాదు 175 రోజులు సక్సెస్ఫుల్గా థియేటర్లలో ఆడింది. కానీ జయం సినిమా కోసం అనుకున్న అల్లు అర్జున్ ని చివరి నిమిషంలో తీసేసి చాలా బాధపెట్టారు.ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.

 ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ఒక పెద్ద నిర్మాత. అలాంటి నిర్మాతని నిజంగా అవమానించారు. అంతేకాదు రాఘవేంద్ర రావు డైరెక్షన్లో బన్నీ ఫస్ట్ సినిమా రాబోతుంది అని అల్లు అరవింద్ చెప్పడంతోనే గుర్తుపెట్టుకోండి.మీ అబ్బాయికి 365 రోజులలోపే పెద్ద హీరో అవుతారు అని చెప్పాను. చెప్పినట్టే గంగోత్రి సినిమాతో చేసి చూపించాను అంటూ రైటర్ చిన్నికృష్ణ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అయితే గతంలో చిన్ని కృష్ణ మెగా ఫ్యామిలీని నిందించారు. ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ ఇస్తే కనీసం చిరంజీవి నాకు విస్తరాకు వేసి ఏనాడు తిండి పెట్టలేదని విమర్శించారు.అదే సమయంలో నేను ఇంట్లో అద్దెకున్నప్పుడు అల్లు అరవింద్ నాకు 10 లక్షలు ఇచ్చారని చెప్పారు.దాంతో ఈయన మాటలు అప్పట్లో వివాదానికి గురయ్యాయి.ఆ తర్వాత మెగా ఫ్యామిలీతో కొన్ని రోజులు మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మెగా అభిమానిగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: