
ఇప్పటికే 50% పైగా షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది . సర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫౌజిజి చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అనే డౌట్ అందరికీ ఉంది . ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు . అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా..? లేదా..? ఆగిపోయిందా..? ఇలా రకరకాల డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇదే మూమెంట్లో ఫౌజి చిత్రాన్ని ఏప్రిల్ నెలలో 2026 వ సంవత్సరంలో రిలీజ్ చేయాలి అంటూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట .
ఆ నెలలో వచ్చే గుడ్ ఫ్రైడే లాక్ వీకెండ్ పై మేకర్స్ కన్నేసిన్నట్లు తెలుస్తుంది. సినీ సర్కిల్స్ లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈలోగా సినిమా షూటింగ్ ముగించేందుకు ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తుంది. కాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ చిత్రాన్ని ప్రారంభించక ముందే ఫౌజి చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేయాలి అంటూ ప్రభాస్ కండిషన్ పెట్టారట. ఫౌజీ సినిమాకి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. చూడాలి మరి ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంతి హిట్ అందిస్తుందో..???