
ఈ విషయం ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా "నాగార్జున"ను అదే విధంగా "శివ" సినిమాను ఎవరైతే ఇష్టపడతారో వాళ్లకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక బిగ్ గుడ్ న్యూస్ చెప్పారు . శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు . ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు . శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాము అంటూ ఆయన వెల్లడించారు . దీంతో నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . శివ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
అప్పట్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా. ఇలాంటి సినిమా ఈ టైంలో రీ రిలీజ్ అవుతూ ఉండడం గమనార్హం . ఈ చిత్ర రీ రిలీజ్ ట్రైలర్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం "కూలీ"తో పాటు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అక్కినేని నాగార్జున కూడా పేర్కొన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది . దీంతో మరొకసారి నాగార్జున థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. చూడాలి మరీ రీ ర్లీజ్ వర్షెన్ లో ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకోబోతుంది అనేది..!?