ఏంటి అమీర్ ఖాన్ ఆస్తికోసం తమ్ముడిని గదిలో వేసి బంధించారా..అమీర్ ఖాన్ సోదరుడు పైసల్ ఖాన్ చేసే ఆరోపణల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే ఎంత పెద్ద హీరోనో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో ఉన్న ఖాన్ త్రయం లో ఈయనకి కూడా చోటు ఉంది. అయితే అలాంటి అమీర్ ఖాన్ గురించి తెలియని ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మానసిక సమస్యలు ఉన్నాయని మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతంగా గదిలో బంధించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక విషయంలోకి వెళ్తే..బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సోదరుడు పైసల్ ఖాన్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.


 అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోదరుడిపై సంచలన ఆరోపణ చేశారు. అమీర్ ఖాన్ గురించి ఫైసల్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు మానసిక సమస్యలు ఉన్నాయని బలవంతంగా మా ఫ్యామిలీ నన్ను గదిలో బంధించింది.అయితే నేను మానసిక చికిత్స కోసం దాదాపు 20 రోజులు మానసిక వైద్యున్ని సంప్రదించి 20 రోజులపాటు చికిత్స చేయించుకున్నాను. ఆ తర్వాత ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక అమీర్ ఖాన్ నన్ను ఒక గదిలో సంవత్సరం పాటు బంధించాడు. ఫోన్ కూడా లాక్కొని టార్చర్ చేశాడు. అలాగే నా గది బయట చాలామంది బాడీగార్డ్ లను కాపలాకి పెట్టి వెళ్ళిపోయాడు.ఇక క్లిష్ట సమయంలో మా నాన్న నాకు సహాయం చేస్తాడు అనుకున్నాను. కానీ నాన్నని ఎలా కలుసుకోవాలో నాకు తెలియదు.

 కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు.దాంతో సంవత్సరం పాటు ఒకే రూమ్లో బందీనై ఉన్నాను. ఆ తర్వాత సంవత్సరానికి వేరే గదికి మార్చాడు అంటూ అమీర్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు పైసల్ ఖాన్.అయితే గత కొద్దిరోజుల నుండి పైసల్ ఖాన్ కి అమీర్ ఖాన్ కి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆస్తి కోసమే పైసల్  ని అలా అమీర్ ఖాన్ రూమ్లో వేసి బందించారా అనే అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి. మానసిక స్థితి బాలేదని పిచ్చివాడిగా చిత్రీకరిస్తే ఆస్తి మొత్తం తానే కొట్టేయవచ్చు అనుకున్నాడా.అసలు అమీర్ ఖాన్ మనసులో ఏముంది అని పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పైసల్ ఖాన్ చేసిన ఆరోపణలతో అమీర్ ఖాన్  ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: