యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానుల ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం (సీడెడ్) లో తారక్ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే 'వార్ 2' సినిమా విషయంలో సీడెడ్ ఏరియా ఫలితం కీలకం కానుందని చాలామంది భావిస్తున్నారు. ఈ సినిమా క్లాస్ యాక్షన్ మూవీ కావడంతో, మాస్ సెంటర్స్ లో ఆదరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కొన్ని గంటల్లో జరగనుంది. ఈ ఈవెంట్ కు ఎలాంటి స్పందన వస్తుంది, అభిమానులు ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తారనేది చూడాలి. ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ గత చిత్రాల మాదిరిగానే 'వార్ 2' కూడా సీడెడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా లేదా అనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. ఈ సినిమా విజయం తారక్ కెరీర్ కు మరింత ఊపునిస్తుందనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ డ్రాగన్ ఇంట్రడక్షన్ క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ పూర్తయిందని ఈ ఏడాది చివరి నాటికీ ఈ సినిమా షూట్  పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి

వార్2 సినిమా, డ్రాగన్ సినిమాలతో తారక్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.  వార్2 సినిమాలో తారక్ 16వ నిమిషంలో ఎంట్రీ ఇస్తారని భోగట్టా. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ బాలీవుడ్ మల్టీస్టారర్లు సైతం  పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా కొరకు ఒకింత ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్  డే కలెక్షన్లు  ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: