
కానీ ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు"నే కావడం గమనార్హం . త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా రిలీజ్ కాబోతుంది . సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు - హిందీ - తమిళం భాషలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేయడం సినిమాకి బిగ్ బిగ్ ప్లస్ పాయింట్ అంటున్నారు మూవీ మేకర్స్ . అంతేనా డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించడం ఇంకో ప్లస్ పాయింట్.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ షమ్మీ ఈ పాత్రను పోషించారు . ఈ సినిమాకి సంబంధించినా ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట . అంతేకాదు ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా ఆఖరికి వచ్చేశాయట . సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ బర్త్డ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సూపర్ హై యాక్షన్ సీన్స్ స్పెషల్ టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారట .
దీనికి సంబంధించి అన్ని ప్లాన్స్ పక్కాగా ముందుకు తీసుకెళ్తున్నాడు డైరెక్టర్ సుజిత్ అంటూ తెలుస్తుంది . ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ సంబరపడిపోతున్నారు. సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది అంటూ భయపడ్డారు . పవన్ కళ్యాణ్ బర్త్డ డే కి ఏ ట్రీట్ అందదేమో అంటూ బాధపడ్డారు . కానీ సైలెంట్ గానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలి అంటూ సుజిత్ నిర్ణయం తీసుకున్నారట. సెప్టెంబర్ 2వ తేదీ ఈ సినిమాకి సంబంధించిన సూపర్ యాక్షన్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్ లు టీజర్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే..!