టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఆయనకు సరైన హిట్ దక్కి చాలా కాలమే అవుతుంది. అలా వరుస అపజయాలతో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. సత్యదేవ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు అన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ సినిమా విడుదల ముందు ప్రకటించడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా జూలై 31 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ కూడా మొదటి రోజు వచ్చాయి. దానితో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని , చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండకు సూపర్ సాలిడ్ విజయం ఈ మూవీతో దక్కబోతోంది అని చాలా మంది భావించారు. మొదటి నాలుగు రోజులు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్  తగ్గాయి. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్టు స్టేటస్ను అందుకోవడం చాలా కష్టంగా కనబడుతుంది. మరి ఈ మూవీ కి ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 28.56 కోట్ల షేర్ ... 46.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 10 రోజుల్లో 42.34 కోట్ల షేర్ ... 80.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగానే ఈ సినిమా 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే మరో 11.16 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్ట వలసి ఉంది. ఇక ఈ రేంజ్ షేర్ కలెక్షన్లను ఈ మూవీ రాబట్టడం కాస్త కష్టం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd