బాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు  ఉన్నారు.. వారందరిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొంది దూసుకుపోతున్నటువంటి నటి అయేషా ఖాన్.. ఈమె హింది బిగ్ బాస్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.. అలాంటి ఈమె సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు వెళ్తోంది.. అయితే ఈమె బెంగాలీ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని బాధ కలిగించిన విషయాలను బయటపెట్టింది.. అవేంటో చూద్దాం.. ఒకప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని,కనీసం తినడానికి కూడా తిండి లేని  పరిస్థితులు ఎదుర్కొన్నారని తెలియజేసింది. 

కానీ ప్రస్తుతం ఓ పొజిషన్ కు వచ్చానని, ఇప్పుడు నేను బతకడమే కాకుండా నా ఫ్యామిలీని కూడా బ్రతికించే స్థాయికి చేరుకున్నానని అన్నది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాను చిన్న వయసులోనే ఎదుర్కొన్నటువంటి లైంగిక వేధింపుల గురించి  కూడా ఈ సందర్భంగా బయటపెట్టింది. నేను చిన్నతనంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మా నాన్న ఫ్రెండు, బాబాయ్ వరుస అవుతాడు. అయితే నేను అలా వెళ్తూ ఉండగా ఆయన పిలిచి నన్ను ఆగమన్నాడు. అక్కడే ఆగిపోయి బాబాయ్ అని పిలిచాను.. కానీ ఆయన సడన్ గా వచ్చి నీ వక్షోజాలు చాలా అందంగా ఉన్నాయని చెబుతూ ముందుకు కదిలాడు. కాస్త బైక్ ముందుకు వెళ్లగానే మళ్లీ వెనక్కి తిరిగి నాకు కన్ను కొట్టాడని తెలిపింది.
 అంతేకాదు అసభ్యంగా సైగలు చేస్తూ వెళ్ళాడు.ఈ విధంగా బాబాయి అని పిలిచే నాకు ఒక్కసారిగా అతనిని చూడగానే షాక్ అయిపోయాను. ఈ విధంగా ఆ వ్యక్తి నన్ను మరోరకంగా చూశాడని, అసభ్యకరంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయెషా ఖాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన నెటిజన్స్  బాబాయ్ అని నోరారా పిలిచిన ఆమెను అలా ఎలా కామంతో మాట్లాడావురా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక ఆయే శకం తెలుగులో ముఖచిత్రం సినిమాతో పరిచయమైంది ఆ తర్వాత ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే వంటి సినిమాలు కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: