సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను రేపు అనగా ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను భారీ ధరకు ఈ మూవీ బృందం అమ్మి వేసింది. మరి ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏ ఏరియాలో ఎంత ధరకు ఈ మూవీ బృందం వారు అమ్మారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత ధరకు అమ్ముడుపోయింది. ఎన్ని కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేస్తే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 16 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ ఏరియాలో ఈ మూవీ కి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఆంధ్ర ఏరియాలో 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 45 కోట్ల భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఈ రేంజ్ లో షేర్ కలక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ వసూలు చేయాలి అంటే ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ రావాలి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: