
ఎందుకు మన టాలీవుడ్ స్టార్స్ ఇలా చేస్తున్నారు? నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో అలాంటి పాత్రను పోషించాడు. ఇద్దరూ మన తెలుగు హీరోలే, కనీసం వాళ్లిద్దరినైనా ప్రోత్సహించాలి కదా..? సినిమాకి ఇంత రిస్క్ తీసుకుని నటించిన వీరి ధైర్యాన్ని ప్రశంసించాలి కదా అంటున్నారు అభిమానులు .. అయితే కావాలనే కొందరు టాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలపై రివ్యూలు ఇవ్వలేదని అంటున్నారు ఫ్యాన్స్. “వీళ్లు రోజుకి పైకి పైకి ఎదుగుతున్నారు” అనే కుళ్ళుతోనే ఇలా చేశారని కూడా చెబుతున్నారు. . .అయినా, వీళ్లు ఇచ్చినా-ఇవ్వకపోయినా సినిమా కొట్టాల్సిన రికార్డులన్నీ కొల్లగొట్టేస్తుందంటున్నారు మరికొందరు. .
కొంతమంది ఫ్యాన్స్ దారుణంగా స్పందిస్తున్నారు. “ఇదేమి ఆలోచన? స్టార్స్ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోరా? ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోరా? ఏం మనుషులు రా బాబు. !” అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. .మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్ 2 సినిమా కూలీ సినిమా కొత్త రకాళ్ల గొడవలని తీసుకొచ్చింది. స్టార్ హీరోస్ అసల రంగుని బయట పెట్టింది. మన సినిమా కాదులే అని లైట్ గా తీసుకున్నారేమో అనే కామెంట్స్ వినపడేఅలా చేసింది.. . .!