
టాలీవుడ్ యంగ్ టైగర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో చేసిన కూలీ సినిమా భారీ క్లాష్ తో విడుదల అయ్యాయి. ఈ బిగ్గెస్ట్ క్లాష్ కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తి తో వెయిట్ చేశారు. ఆగస్టు 15 కానుకగా ఒక రోజు ముందే నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన సినిమాలు విడుదల ముందు ఒకలా అయ్యాక ఒకలా లెక్కలున్నాయని ట్రెండింగ్ రిపోర్టులు చెపుతున్నాయి.
ఇక డే 1 కి ముందు వరకు బుక్ మై షో హావర్లీ ట్రెండింగ్ లో కూలీ దూసుకు పోయింది. కూలీ సినిమాకు వచ్చిన క్రేజ్ ముందు వార్ 2 కాస్త డౌన్ అయినట్టు గా కనిపించింది. అయితే ఇప్పుడు డే 2 నుంచి చూస్తుంటే వార్ 2 తన డామినేషన్ చూపిస్తుంది. ఈ రోజు ఉదయం కూలీ 13 వేలు టికెట్స్ తో ట్రెండ్ అయితే వార్ 2 14 వేలు గా ఉంది. ఇది గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నానికి కూలీ 39 వేల టిక్కెట్స్ తో ఉంటే .. వార్ 2 61 వేల టిక్కెట్స్ తో దూసుకు పోతోంది. మొత్తానికి ఇలా డే 2 నుంచి మాత్రం వార్ 2 లెక్కలు మారుస్తుంది అని చెప్పాలి. ఇక వసూళ్ళు కూడా ఇదే రీతిలో ఉంటాయా లేదా అనేది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు