కీర్తి సురేష్ ఇప్పటివరకు అన్ని పద్ధతి గల పాత్రలనే పోషించింది.ఒక బాలీవుడ్లో కాస్త పొట్టి డ్రెస్ వేసి హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది తప్ప సౌత్ లో చేసిన ప్రతి ఒక్క సినిమా లో కీర్తీ సురేష్ చాలా అద్భుతంగా నటించడమే కాదు సాంప్రదాయ బద్దంగా కూడా ఉండేది. ఏదో ఒకటి రెండు పాటలకు కాస్త పొట్టి బట్టలు వేసేది తప్ప మిగతా సినిమాలు మొత్తం చాలా సంప్రదాయంగా ఉండేది.ఇక పెళ్లయ్యాక కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ మూవీ సమయంలో కాస్త పొట్టి పొట్టి బట్టలు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు బేబీ జాన్ సినిమాలో కాస్త ఘాటుగా రొమాన్స్ చేసినట్టు విమర్శలు వినిపించాయి. కానీ కీర్తి సురేష్ ని అలాంటి పాత్రలో అభిమానులు ఊహించుకోలేకపోయారు.

ఇక చివరికి సినిమా రిజల్ట్ కూడా ప్లాఫ్.ఇదంతా పక్కన పెడితే తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించి ది డర్టీ పిక్చర్ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది.. ఇక ఫోటో చూస్తే కీర్తికి సురేష్ అభిమానుల గుండెలు పగిలిపోతాయి. ఎందుకంటే ఆ ఫోటోలో కీర్తి సురేష్ కి ఇద్దరు అబ్బాయిలు ముద్దులు పెడుతున్నారు. ఆ ఇద్దరు అబ్బాయిల మధ్యలో కీర్తి సురేష్ ఉంది. ఇక ఈ ఫోటోకి డర్టీ పిక్చర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఫోటోని కోలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నెటిజన్ దీన్ని వైరల్ చేస్తూ సిల్క్ స్మిత బయోపిక్ లో కీర్తి సురేష్ నటిస్తుంది అంటూ వైరల్ చేశారు.
అయితే ఇప్పటికే సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్ పేరుతో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్రలో నటించింది. మరి అలాంటిది మళ్లీ కీర్తి సురేష్ సిల్క్ స్మిత బయోపిక్ లో ఎలా నటిస్తుంది అని చాలామందికి డౌట్ రావచ్చు.కానీ ది డర్టీ పిక్చర్ పేరుతో వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని,అది క్రియేట్ చేసిన పోస్టర్ మాత్రమే అని కీర్తి సురేష్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు ఇప్పటికే డర్టీ పిక్చర్ పేరుతో సిల్క్ స్మిత బయోపిక్ వచ్చింది. అలాంటిది మళ్లీ కీర్తి సురేష్ ఆ బయోపిక్ లో ఎలా నటిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: