తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన దర్శకులలో వివి వినాయక్ ఒకరు. ఈయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన ఆది అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వినాయక్ కి దర్శకుడిగా మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ సమయం లోనే వినాయక్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వినాయక్ దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే వినాయక్ ప్రస్తుతం ఓ సీనియర్ స్టార్ హీరో కోసం కథను తయారు చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఆ హీరోకు అ కథను వినిపించనున్నట్లు , అన్ని ఓకే అయితే వినాయక్ నెక్స్ట్ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... వినాయక్ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథను తయారు చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే దానిని వెంకటేష్ కు వినిపించనున్నట్లు , ఒక వేళ వెంకటేష్ కి గనుక ఆ కథ నచ్చినట్లయితే వెంకీ , వినాయక్ కాంబోలో మూవీ కన్ఫామ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

గతంలో వెంకటేష్ హీరో గా రూపొందిన లక్ష్మీ మూవీ కి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక వేళ వెంకీ , వినాయక్ కాంబోలో మరో మూవీ గనుక ఓకే అయినట్లయితే దానిపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: