"సుధ" అనే పేరుకు ఉన్న పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా, ఎవరికీ లేని స్పెషల్ క్రేజ్, గుర్తింపు సంపాదించుకున్న ఏకైక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ అని చెప్పాలి. ప్రముఖ నటి సుధకు టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలు గౌరవం, ఇష్టం కలిగించారు. "ఆమె చక్కగా నటిస్తుంది, అందరితో కలివిడిగా ఉంటూ ముందుకు వెళ్తుంది" అని ఆమెతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చెబుతారు. ముఖ్యంగా తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రల్లో నటించి ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అసలు నటి సుధలా నటించే వారు ఇండస్ట్రీలో లేరని చెప్పడంలో సందేహమే లేదు. ఒక హీరోయిన్‌కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సుధకు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


ముఖ్యంగా రౌడీ అల్లుడు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, హలో బ్రదర్, సుస్వాగతం, ప్రేమించుకుందాం రా, మన్మధుడు, మేజర్ చంద్రకాంత్, అతడు, జై చిరంజీవ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అన్ని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎవరికైనా తల్లిగా, అక్కగా, వదినగా..ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రలో మంత్ర ముగ్ధులను చేసేస్తుంది సుధ. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, తనపై ఒక్క కాంట్రవర్శియల్ కామెంట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం ప్రశ్నలు వచ్చినట్టుగానే ఘాటుగా మాట్లాడింది. ఎవరి మీద నేరుగా నిందలు వేయకపోయినా, తాను ఎవరో నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేసింది.



రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను ప్రశ్నిస్తూ.."ప్రగతి, పవిత్ర లోకేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చిన తర్వాత మీ అవకాశాలు తగ్గిపోయాయి, మిమ్మల్ని సైడ్ చేశారు అనేది బయట టాక్.. నిజమేనా?" అని అడగ్గా.."దీనికి సుధ వెంటనే స్పందిస్తూ—"అసలు నన్ను సైడ్ చేయడానికి వాళ్లు ఎవరండీ?" అంటూ మండిపడింది".



ఆమె మాట్లాదుతూ.."నాకంటూ ఇండస్ట్రీలో ఒక రికార్డు ఉంది. ఇది అందరికీ తెలుసు. నేను చిరంజీవి గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను. అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాను. ఇది నా రికార్డు. నేను నటించిన ఎన్నో సినిమాలు వంద రోజులు విజయవంతంగా ఆడాయి. ఇప్పటికీ చాలామంది నన్ను అభినందిస్తున్నారు. ఇలాంటి రికార్డులు పవిత్ర లోకేష్‌కి గాని, ప్రగతికి గాని ఉన్నాయా? మీరే చెప్పండి" అని సూటిగా ప్రశ్నించింది.అంతేకాదు,"పవిత్ర లోకేష్, ప్రగతి చేసిన సినిమాలు చూడండి.. టేబుల్ మీద పెన్సిల్‌లా ఉంటాయి. వాళ్ల పాత్రలకు నటించే స్కోప్ ఉండదు. బహుశా వాళ్లకు డబ్బులు లేక అలాంటి పాత్రలకు ఒప్పుకున్నారేమో నాకు తెలియదు. కానీ నేను వాళ్లకి సమానం కాదు. నాతో వాళ్లకి పోలికే లేదు. గ్యాంగ్ లీడర్ లో నా నటన గురించి అందరూ ప్రశంసించారు. మన్మధుడులో నాగార్జునతో నటించా.. అలాగే ఆయనతో ఏకంగా 17 సినిమాలు చేశాను. వీళ్ళు ఎవరైనా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో పట్టుమంటే నాలుగు సినిమాలు చేశారా? అలాంటప్పుడు వాళ్లకు నాకు పోటీ ఎలా అవుతారు? మీరే చెప్పండి" అని బలంగా చెప్పింది.



ఇంకా.."పవిత్ర లోకేష్‌, ప్రగతిలను చూస్తే నాకు జాలి వేస్తుంది. వాళ్లకు టాలెంట్ ఉంది, కానీ ఇండస్ట్రీ వాళ్లను ఒక ప్రాపర్టీలా మాత్రమే వాడుకుంటున్నారు. నటించే స్కోప్ ఉన్న పాత్రలు వాళ్లకు రావడం లేదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఇంతవరకు తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలా మాట్లాడని సుధ, తొలిసారి ఈ విధంగా ఘాటుగా స్పందించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని వెనక ఏదో పెద్ద ఇబ్బంది, బాధ అనుభవం దాగి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు. యాంకర్ అన్నట్టుగానే పవిత్ర, ప్రగతిలు నిజంగానే సుధ అవకాశాలను తగ్గించారు ఏమో. ఆ కారణంగానే "వాళ్లు నాకు పోటీ ఎప్పటికీ కారు" అంటూ పరోక్షంగా చెప్పిందేమో అని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. మొత్తానికి, నటి సుధ చెప్పినట్టుగానే— సుధకి ఎవరు సాటేరు రారు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ రారు. ఇండస్ట్రీలో ఆమె స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: