మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి అల్లు కనకరత్నమ్మ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన, "దివంగ‌త సీనియర్ న‌టులు అల్లు రామ‌లింగ‌య్య గారి స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గారి త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ గారు మృతి చెందడం బాధాక‌రం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.

జగన్ ట్వీట్‌కి అల్లు అర్జున్ స్పందిస్తూ, "థాంక్యూ జగన్ గారు.. మీ మంచి మాటలు, మద్దతు చాలా సంతోషం" అని బదులిచ్చారు. ఈ ఘటన అల్లు అర్జున్ రాజకీయ వైఖరిపై చర్చకు దారితీసింది. తాను ఏ రాజకీయ పార్టీకి పరిమితం కాదని, కష్టకాలంలో తనకు అండగా నిలిచే వారికి కృతజ్ఞత చూపడంలో వెనకాడనని బన్నీ ఈ స్పందన ద్వారా పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలకు అల్లు అర్జున్ ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తుంది.

తన కుటుంబాన్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతగా ఆయన ఆనందం వ్యక్తం చేయడం, రాజకీయాలకు సంబంధం లేకుండా మానవత్వ కోణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సంఘటన ద్వారా అల్లు అర్జున్ ప్రజల దృష్టిలో మరింత మెప్పు పొందారు. బన్నీ  సినీ కెరీర్ విషయానికి వస్తే   ప్రస్తుతం అట్లీ  డైరెక్షన్ లో అల్లు అర్జున్  నటిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్ సన్  పిక్చర్స్ బ్యానర్ లో ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తవుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ ప్లాన్స్  మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: