డైరెక్టర్ తెలుగు సినిమాలు చేసినందుకు తన చెప్పుతో తానే కొట్టుకున్నారు.. అంతేకాదు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని ఉంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే త్రిభాణధారి భార్బరిక్ మూవీ తీసిన మోహన్ శ్రీవత్స. తాజాగా త్రిభాణదారి బార్బరిక్ మూవీ విడుదలైంది.కానీ ఈ సినిమా చూడడానికి ఎవరు థియేటర్లకు రాకపోవడంతో దీని గురించి చెబుతూ డైరెక్టర్ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.అలాగే సినిమా థియేటర్ కి వెళ్లి చూడగా కేవలం 10, 15 మంది ఉన్నారు,ఆ పది పదిహేను మందిలో తాను డైరెక్టర్ అని చెప్పకుండా సినిమా ఎలా ఉంది అని అడగగా ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉంది అని రివ్యూ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఈ సినిమా డైరెక్టర్ ని అని చెప్పడంతో వాళ్లంతా హగ్ చేసుకొని సార్ సినిమా బాగా చేశారు అని అన్నారు. 

వాళ్ళు అంత బాగా రివ్యూ ఇస్తే అసలు సినిమా చూడడానికి మిగతా వాళ్ళు ఎందుకు రావడం లేదు.ఒకసారి వస్తే కదా సినిమా ఎలా ఉందో చెప్పడానికి. మలయాళం కంటెంట్లు బాగుంటాయని మలయాళం కంటెంట్ తీసుకొని నేను ఈ సినిమా చేశాను. కానీ సినిమా చూడడానికి ఎవరూ రాలేదు. నా రెండున్నరేళ్ళ కష్టం ఇది. సినిమా విడుదలకు ముందు సినిమా మీరు చూసి వచ్చి బాలేదు అని చెబితే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అని అన్నాను. అయితే ఇప్పుడు మీరు సినిమా చూడడానికి వెళ్లడం లేదు. కానీ నేను మాత్రం తెలుగు సినిమాలు చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటాను. అలాగే మా ఆవిడ సినిమా  రిజల్ట్ వచ్చాక నన్ను చూసి భయపడుతోంది. ఆమె సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్ళింది. కానీ నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పడంతో ఎక్కడ నేను మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటానోనని భయపడి వెంటనే వచ్చేసింది. 

అసలు మలయాళం కంటెంట్ అయితేనే అందరూ సినిమా థియేటర్లకు ఎగబడి మరీ వెళ్లి చూస్తారు. కానీ అలాంటి మలయాళం సినిమా చేస్తే ఎవరు నన్ను ఆదరించలేదు. ఇప్పటినుండి నేను తెలుగులో సినిమాలు మానేస్తాను భయ్యా. మలయాళం లోకి వెళ్లి అక్కడే డైరెక్టర్గా సెట్ అయ్యి తెలుగు డైరెక్టర్ సత్తా ఏంటో నిరూపించుకుంటాను. ఇక తెలుగు సినిమాలు చేయను అంటూ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స ఏడుస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు తెలుగు వాళ్లకి ఇలాగే ఉంటుంది. తెలుగు వారిని ప్రోత్సహించారు. ఇతర ఇండస్ట్రీల సినిమాలను ఎక్కువగా పట్టించుకుంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: