"పవన్ కళ్యాణ్" అనేది కేవలం ఒక పేరు మాత్రమే అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఆయన పేరు వెనుక ఉన్న అభిమాన గణం, ఆయన సృష్టించిన ప్రభావం తెలుగు సినీ పరిశ్రమలో ఒక శాసనం లాంటిది. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగు సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఉండేదో అని సీరియస్‌గా మాట్లాడుకునే వారు కూడా ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ రంగంలోని చాలామంది ప్రముఖులు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు.న్ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక ఫోటో వైరల్ అవుతోంది.
 

మనందరికీ తెలిసిందే, నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా అంతా హ్యాష్‌ట్యాగ్‌లతో నింపేశారు. "జై పవర్ స్టార్," "హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్" అంటూ అభిమానులు భారీ కట్‌అవుట్లు ఏర్పాటు చేసి, వేడుకలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే సినిమాలపై కూడా కొన్ని స్పెషల్ అనౌన్స్‌మెంట్లు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. ఇదే సమయంలో, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఒక అరుదైన ఫోటో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది.



ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కుతూ ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఈ మరెవరో కాదు  కొనిదెల సుస్మిత, చిరంజీవి పెద్ద కూతురు మరియు హీరో రామ్ చరణ్ అక్క. పవన్ కళ్యాణ్‌కు కూతురు వరస అవుతుంది సుస్మిత.  ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పట్ల చూపించిన ప్రేమ, గౌరవం అభిమానుల హృదయాలను కదిలించింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కుటుంబ సభ్యులతో సరదాగా, జాలీగా గడిపే వ్యక్తి. చిన్నప్పుడు రామ్ చరణ్, సుస్మితలతో చేసిన అల్లరి పనుల గురించి సుస్మితే ఒక ఇంటర్వ్యూలో సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చింది. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపింది.



పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన జీవితంలోని ప్రతీ మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండింగ్‌లోకి తీసుకువెళ్తున్నారు. అంతేకాదు, ఈ నెల 25న ఆయన నటించిన "ఓజీ" సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. అభిమానులు ఆయన సినిమాలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. పవర్ స్టార్ పేరు వినగానే అభిమానుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు సహజంగానే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హంగామా చేస్తాయి. ఈసారి కూడా అదే జోరు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక లెజెండ్, ఆయన వ్యక్తిత్వం ఒక ఇన్‌స్పిరేషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: