ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన టీవీ షో లలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ టెలివిజన్ కార్యక్రమాన్ని మొదట ఇండియా లో హిందీ లో ప్రారంభించారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి రావడం మొదలు అయింది. దానితో హిందీ లో బిగ్ బాస్ షో ప్రారంభం అయిన కొంత కాలానికి దీనిని తెలుగు లో కూడా ప్రారంభించారు. ఇప్పటివరకు తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై 8 సీజన్లను , ఓ టీ టీ పై ఒక సీజన్ ను విజయ వంతంగా కంప్లీట్ చేసుకుంది.

బిగ్ బాస్ 9 వ సీజన్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. దీనికి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ 9 వ సీజన్ కు సంబంధించిన పలు ప్రోమోలను బిగ్ బాస్ బృందం వారు విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే బిగ్ బాస్ 9 వ సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఈ సారి సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది వీరే అని అనేక మంది పేర్లు ఇప్పటికే తెర పైకి వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వారిలో ఒక ఫోక్ సింగర్ పేరు తెగ వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఎన్నో ఫోక్ సాంగ్స్ లో నటించి తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసిన నాగ దుర్గ బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ 9 వ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఎవరు అనేది పెద్దగా క్లారిటీ లేదు. మరి బిగ్ బాస్ 9 లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యాకే తెలుస్తుంది మరి ఈ సారి హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: