కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో విక్రమార్కుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ ఒక పాత్రలో సిన్సియర్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించగా ... మరొక పాత్రలో దొంగగా కనిపించాడు. ఈ రెండు పాత్రలలో కూడా తనదైన వేరియేషన్స్ చూపించే అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో కాలేజ్ పాపల బస్సు అంటూ ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ లో టెన్నిస్ ప్లేయర్ గా ఓ బ్యూటీ కనిపిస్తోంది. ఈమె ఈ సినిమాలోని ఈ సాంగ్ లో చాలా తక్కువ సమయం కనిపిస్తోంది. కానీ ఆ తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈమె తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఈమె పేరు ఏంటి ..? ఈమె ఎన్ని సినిమాల్లో నటించింది అనే వివరాలను తెలుసుకుందాం.విక్రమార్కుడు సినిమాలో కాలేజ్ పాపాల బస్సు సాంగ్ లో టెన్నిస్ ప్లేయర్ గా కనిపించిన బ్యూటీ పేరు కౌశ. ఈ బ్యూటీ మన్మధుడు , ప్రేమాయ నమ: ,  దిల్ , రారాజు , అత్తిలి సత్తిబాబు ఎల్ కే జీ , మంత్ర ,  బ్లేడ్ బాజ్జీ , కుబేరులు , ఇందు మతి , నేను మీకు తెలుసా , సిద్దు ప్లస్ 2 , బ్రోకర్ , మహంకాళి అనే సినిమాల్లో కౌశ నటించింది. ఇలా ఈమె తన కెరీర్లు చాలా తెలుగు సినిమాల్లో నటించిన ఈమె నటించిన సినిమాల్లో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు వరుస పెట్టి సినిమాలో నటించిన ఈమె ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలు చేయడం లేదు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో కొన్ని వైరల్ ఆయన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt