తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ  ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో చాలా సినిమాల్లో నటించిన ఈయనకు అల్లుడు శీను , రాక్షసుడు సినిమాలతో మంచి విజయాలు దక్కాయి. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన నటించిన సినిమాలు వరుస పెట్టి బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈయన హీరో గా రూపొందిన అల్లుడు అదుర్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత హిందీ లో చత్రపతి అనే సినిమాలో నటించాడు.

మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఈయన భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. తాజాగా ఈ నటుడు కిష్కింధపురి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. వరుస పెట్టి ఆపజయాలను అందుకుంటున్న ఈయన నటించిన కిష్కిందపురి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ఏపీ లో 3 కోట్లు , నైజాం లో 1.5 కోట్లు  , సీడెడ్ లో ఒక కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లు సమాచారం.

ఇకపోతే ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా ఈజీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది అని , ఈ సినిమాకు మంచి టాక్ వస్తే భారీ లాభాలను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి వరుస అపజయాలతో డీలా పడిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ "కిష్కిందపురి" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss