టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశ విదేశాలలో కూడా ఉన్నది. ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు మీద ఎన్నో రికార్డులు కూడా నెలకొన్న ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పేరు మీద సరికొత్త రికార్డు నెలకొన్నట్లు తెలుస్తోంది. తాను వేసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఒకటి చాలా ఖరీదైనగా నిలిచిందంటూ , "బ్యుల రూబీ" అనే ఒక పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను చేసింది. స్వతాగ తెలుగు అమ్మాయి అయినప్పటికీ బ్యుల జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఎంతోమంది తెలుగు హీరోలకు సంబంధించి పెన్సిల్ స్కెచ్ లు వేసి ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది.


ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ది మోస్ట్ ఎక్స్పీన్సివ్  పెన్సిల్ ఆర్ట్ ఆఫ్ ది తెలుగు యాక్టర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ను ఆమె షేర్ చేయడం జరిగింది. ఈ ఆర్ట్ ను 1650 యూఎస్ డాలర్లకు అమ్మినట్లుగా తెలిపింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,45,300 రూపాయలు అన్నమాట. ఈ డబ్బులను ఆమె అకౌంట్లో పడినట్లుగా చెబుతూ ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. మరి ఇందులో ఎంత నిజం ఉన్నదనే విషయం తెలియదు కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.

.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నటించిన చిత్రం వార్ 2. ఈ సినిమా విడుదలైనప్పటికీ  మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఎన్టీఆర్ నటనకు మాత్రం బాగానే పేరు వచ్చింది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్  నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా దేవర 2 సినిమాలో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్లో వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి: