
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు.. తన ఫిల్మ్ కెరీర్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మీకు ఎటువంటి స్టోరీస్ ఇష్టమని ప్రశ్నించగా.. `అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమమయం. తాత మొదలుకొని మేము చేసిన ప్రేమ కథలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. పర్సనల్‌గా కూడా ప్రేమ కథలంటేనే నేను ఎక్కువగా ఇష్టపడతా. కాకపోతే యాక్షన్, వరల్డ్ బిల్డింగ్ అంటూ ఆడియన్స్ కొత్త జోనర్స్ ను ఇష్టపడుతున్నారు.
అందువల్ల మజిలీ, లవ్ స్టోరీ సినిమాలు చేశాక నా ఆలోచన విధానం మారిపోయింది. అయితే ఆ మధ్య లవ్ స్టోరీస్‌ను చాలా మిస్ అవుతున్నా. మా డైరెక్టర్స్‌ను మంచి ప్రేమ కథ ఉంటే చెప్పమని అడుగుతుంటా` అని చైతు చెప్పుకొచ్చాడు. అయితే నాగ చైతన్య మజిలీ ప్రస్తావన తేవడంతో.. ఫ్యాన్స్ సమంతను గుర్తు చేసుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ పై మరోసారి ఈ జంటను చూడాలని ఆశపడుతున్నారు. కానీ అది జరిగే పని కాదు అన్నది జగమెరిగిన సత్యం.
ఇకపోతే `16 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో నేను చాలా నేర్చుకున్న. ఇంకా నేర్చుకోవాల్సింది చేయాల్సింది ఎంతో ఉంది. కెరీర్ ఆరంభంలో ఫెయిల్యూర్స్ వస్తే కష్టంగా అనిపించేది. కానీ రాను రాను పరిణితి చెందాను. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించడం మొదలుపెట్టాడు. రిజల్డ్ కాకుండా సినిమా నుంచి వచ్చిన అనుభవాన్ని తీసుకుని ముందుకు వెళ్లాలని నాన్న చెప్పేవారు. ఆ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి` అంటూ ఈ సందర్భంగా నాగ చైతన్య చెప్పుకొచ్చారు.