టాలీవుడ్ లో ప్రతీ వారం కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చాలా సినిమాలు ప్లాపులు అవుతుంటాయి. హిట్ సినిమాల లిస్టులో చేరిన తాజా సినిమా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా. కొత్త టాలెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. యంగ్ హీరో మౌళి తనూజ్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు సాయి మార్తాండ్ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ తో యూత్ లో మంచి బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా, విడుదల రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా మొదటి రోజు నుంచే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ షోలు కనబడుతున్నాయి.


ఇక వసూళ్ల విషయానికొస్తే, నాలుగు రోజుల వరల్డ్‌వైడ్ రన్ లోనే ఈ సినిమా 15.41 కోట్ల గ్రాస్ రాబట్టింది. కొత్త హీరోల సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం చాలా గ్రేట్ అని టాలీవుడ్‌ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వేగం చూస్తే, లాంగ్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల మార్క్ చేరే అవకాశాలున్నాయి. సినిమాలో హీరో - హీరోయిన్‌ల కెమిస్ట్రీ, కామెడీ ట్రాక్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అలాగే రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్యకృష్ణన్ తదితరులు పోషించిన పాత్రలు కథకు బలాన్ని చేకూర్చాయి. నిర్మాణ పరంగా కూడా ఆదిత్య హాసన్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి విలువలతో సినిమా అందించారు. టాలీవుడ్‌లో పెద్ద హీరోలు, సీనియ‌ర్లు ఇలాంటి క‌థాబ‌లం ఉన్న సినిమాలు చేయాల‌న్న డిమాండ్లు ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.


మొత్తం మీద, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మేళవించి రూపొందిన ‘లిటిల్ హార్ట్స్’ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. థియేటర్స్ లో వసూళ్లు దూసుకుపోతుండటంతో ఈ సినిమా వచ్చే రోజుల్లో టాలీవుడ్ లో మరింత సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: