డైరెక్టర్ బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో మోస్ట్ అవైడేడ్ చిత్రం అఖండ 2. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్, విఎఫ్ఎక్స్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందనే విధంగా వినిపిస్తున్నాయి .ముఖ్యంగా అఖండ 2 సినిమా క్లైమాక్స్ సిన్స్ పై చాలా జోరుగానే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి భాగంలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించగా ఇప్పుడు సీక్వెల్లో బాలకృష్ణ శివుడి అవతారంలో కనిపించి విలన్స్ ను అంతం చేసే సన్నివేశాలను తెరకెక్కించే విధంగా బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.


ఈ సన్నివేశాలకు సంగీత దర్శకుడు థమన్ ఈ సీన్స్ కి ఊపునిచ్చే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని వినిపిస్తున్నాయి. బాలయ్య ఇందులో శివుడిగా ఎంట్రీ ఇస్తూ త్రిశూలం, డమరుకం చేతిలో ఉంటూ సమరం చేసే సన్నివేశాలు కూడా ఫ్యాన్స్ అని మరింత ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. స్పెషల్ విఎఫ్ఎక్స్ టీమ్ తో ఇందుకోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్ ను డిజైన్చ చేయించబోతున్నారు.



అఖండ 2 సినిమా కేవలం యాక్షన్ సినిమానే కాకుండా ఒక బలమైన పొలిటికల్ డ్రామాగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య రెండు పాత్రలో కనిపించబోతున్నారు. ఒకటి శివుడి భక్తుడిగా, మరొకటి అఘోర పాత్రలో కనిపిస్తారు. ధర్మం కోసం పోరాడే పాత్ర ఒకరిది, మరొకటి పొలిటికల్ లీడర్గా జనంలో పేరు సంపాదించే పాత్రమరొకటి అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలను కనెక్ట్ చేస్తూ కథ ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో  రీలీట్ చేయబోతున్న ఈ సినిమా కోసం బాలకృష్ణనే స్వయంగా ఈ సినిమా కోసం హిందీ డబ్బింగ్ చెప్పబోతున్నారు. అలాగే సంజయ్ దత్ ఇందులో ఒక ఉగ్రవాద నేతగా కనిపించబోతున్నారనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. బాలయ్య, సంజయ్ దత్ మధ్య జరిగే క్లైమాక్స్ ఫైట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని వినికిడి. మరి సంజయ్ దత్ ఎంట్రీ తో అఖండ 2 హిందీ మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చూపిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: