
ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు మూవీ సాంగ్ షూట్ జరుగుతోందని ఈ మూవీ సెట్స్ కు అమ్మ వచ్చిందని అప్పటివరకు నాన్న బాగానే డ్యాన్స్ చేశారు కానీ అమ్మ సెట్స్ కు వచ్చిన వెంటనే నాన్న స్టెప్స్ మరిచిపోయారని సుష్మిత చెప్పుకొచ్చారు. నాన్న అటూఇటూ ఇవ్వడం, స్టెప్స్ మరిచిపోవడం జరిగాయని సుష్మిత పేర్కొన్నారు. చిరంజీవి భార్యను చూసిన వెంటనే భయంతో కూడిన ప్రేమ వల్ల తడబడ్డారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సుస్మిత చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి పారితోషికం రికార్డ్ స్థాయిలో ఉండగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సాహో గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు