ఈ వారం థియేట‌ర్స్ లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న క్రేజీ చిత్రాల్లో `కిష్కింధ‌పురి` ఒక‌టి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట‌ర్ చేసిన హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం పాన్ ఇండియా ఫిల్మ్ `మిరాయ్‌`తో పోటీ ప‌డుతూ కిష్కింధ‌పురి బ‌రిలోకి దిగుతోంది.


తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెంట్‌, ప్ర‌మోష‌న్స్ ద్వారా మేక‌ర్స్ పెంచిన హైప్ దృష్ట్యా కిష్కింధ‌పురికి డీసెంట్ బిజినెస్ అయింది. నిజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1.5 కోట్లు, ఆంధ్రలో రూ. 3 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఓవ‌రాల్ ఏపీ మ‌రియు తెలంగాణలో చూసుకుంటే రూ. 7.50 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కిష్కింధ‌పురి సొంతం చేసుకుంది.


అలాగే క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా మ‌రియు ఓవ‌ర్సీస్ క‌లిసి రూ. 2 కోట్లు బిజినెస్ జ‌రిగింది. కిష్కింధ‌పురి వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 9.50 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఎదుట ఉన్న‌ది ఈజీ టార్గెట్ అనే చెప్పుకోవాలి. టాక్ క‌నుక అనుకూలంగా వ‌చ్చిందంటే సినిమా అవలీలగా బ్రేక్ ఈవెన్ అవ్వ‌డం, బెల్లంకొండ ఖాతాలో హిట్ ప‌డ‌టం ఖాయ‌మ‌వుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: