టాలీవుడ్ హీరో తేజ సజ్జా ఇండస్ట్రీలోకి  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు . తాజాగా తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న తేజ సజ్జా పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హీరో "రానా" విషయంలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.



తేజ సజ్జా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నాకు కొంతమంది మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని అందులో తనకి ఉదయం 3 గంటలకే హీరో రానా నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుంది.. రానా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తారని..తాను కూడా అదే టైమ్లో మెలకువతో ఉంటే కచ్చితంగా రానా మెసేజ్ కి రిప్లై ఇస్తానంటూ తెలిపారు తేజ సజ్జా. రానా చాలా డెడికేషన్ తో ఎలాంటి పని అయినా చేస్తారని. తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిన సరే రానాకే మొదట కాల్ చేసేది అంటూ తెలిపారు తేజ సజ్జా.



తాను నాకు ఒక మాట ఇచ్చారు.. అదేమిటంటే నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నీకు అండగా ఉంటా.. నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పారు. అప్పటినుంచి నాకే సపోర్టుగానే కాకుండా ఇండస్ట్రీలో చాలామందికి చాలా సహాయం చేస్తూ ఉంటారు అంటూ తెలిపారు తేజ సజ్జా. కానీ తాను చేసిన సహాయాన్ని ఎప్పుడూ చెప్పుకోరు రానా అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. డబ్బు, పేరు కోసమో కాదు కేవలం అతనికి మంచి మనసు వల్లే ఇలా చేస్తున్నారంటూ తెలిపారు తేజ సజ్జా. మొత్తానికి రానా గురించి ఎవరికీ తెలియని విషయాన్ని మాత్రం బయట పెట్టారు   తేజ  

మరింత సమాచారం తెలుసుకోండి: