కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా.. మంచు మనోజ్ విలన్ గా..రితికా నాయక్ హీరోయిన్ గా..శ్రీయా శరణ్ కీలక పాత్రలో నటించిన తాజా మూవీ మిరాయ్.. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 12న విడుదలైన మిరాయ్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన చాలామంది నెటిజన్లు ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెట్టడమే కాకుండా తేజ సజ్జా,మంచు మనోజ్ ల యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో మనోజ్ పవర్ఫుల్ విలన్ రోల్ లో  అదరగొట్టేసారని అంటున్నారు. మంచు మనోజ్ కి ఈ సినిమా కెరియర్ టర్నింగ్ పాయింట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బీజీఎం,డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయని,కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ ఊహించేవిగా..గతంలో వచ్చినవిగా కాస్త బోర్ కొట్టిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. 

ఏది ఏమైనప్పటికి మిరాయ్ సినిమా మాత్రం హిట్ టాక్ రావడంతో సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మిరాయ్ సినిమా హిట్ అవ్వాలని ఎంతోమంది అభిమానులతో పాటు నెటిజన్స్, సెలబ్రిటీలు కోరుకుంటున్న వేళ మంచు విష్ణు కూడా మనోజ్ నటించిన మిరాయ్ మూవీకి విషెస్ తెలపడం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఎందుకంటే కొద్ది నెలల నుండి మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా మనోజ్ విష్ణుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మంచు విష్ణు సినిమాకి మనోజ్, మనోజ్ సినిమాకి విష్ణు ఒకరికొకరు స్పెషల్ విషెస్ తెలియజేసుకుంటూ అన్నదమ్ముల బంధాన్ని చాటి చెప్పుకుంటున్నారు. ఇక కన్నప్ప మూవీ విడుదలైన సమయంలో కూడా మనోజ్ స్పెషల్గా కన్నప్ప టీం కి విష్ చేయడమే కాకుండా మొదటి షో చూసి బ్లాక్ బస్టర్ అనే రివ్యూ ఇవ్వడంతో పాటు కన్నప్ప క్లైమాక్స్ లో మంచు విష్ణు నటనని కొనియాడడం మనం చూసాం. 

అయితే తాజాగా మనోజ్, తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా విడుదలవ్వడంతో మంచు విష్ణు కూడా తనదైన శైలిలో స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో మిరాయ్ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూనే ఆ దేవుడి ఆశీస్సులు మీ టీమ్ అందరికీ ఉంటాయి అంటూ పోస్ట్ పెట్టారు. అయితే ప్రస్తుతం విష్ణు చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో మంచు ఫ్యామిలీ మధ్య పగ చల్లారిపోయినట్లే అని..అన్నదమ్ములు ఒకరి ఈ సినిమాకు మరొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు.మరి కన్నప్ప టీం కి మనోజ్ విష్ చేశారని ఏదో నామమాత్రంగా విష్ణు కూడా విష్ చేశారా.. లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మెల్లిమెల్లిగా సమసి పోతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీ అభిమానులకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: