
మీరాయ్ సినిమాని దాదాపుగా రూ .60 కోట్ల రూపాయలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించారు. ఈ సినిమాలో నటించిన హీరో తేజ సజ్జా కి రూ.2 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్స్ లో కూడా తేజ హనుమాన్ సినిమాకి ఎంత తీసుకున్నానో అంతే తీసుకున్నానని చెప్పారు. అయితే ఇతర సినిమాలకు మాత్రం రూ .15 కోట్లు తీసుకుంటున్నారట. మంచు మనోజ్ రూ.3 కోట్ల రూపాయలు. శ్రియా రూ.2 కోట్ల రూపాయలు, హీరోయిన్ రితిక నాయక్ రూ.50 లక్షల తీసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇందులో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు తేజ క్యారెక్టర్ ని ఇందులో చాలా భిన్నంగా చూపించారని ఒక యోధుడిగా, యాక్షన్ హీరోగా చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్లో ఉంటుందని అభిమానులు ఎంతో ఆశపడినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇందులోని పాటను తొలగించడానికి గల కారణం ఈ సినిమాలో ఉండే కథను డిస్టర్బ్ చేస్తుందనే భావనతో చివరి నిమిషంలో ఈ పాటను తీసివేసినట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి పాజిటివ్ టాక్ సంపాదించిన మీరాయ్ మొదటిరోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో చూడాలి మరి.