
రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న కొన్నేళ్ళకు విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి అకిరా, అధ్యా పిల్లలు ఉన్నారు. విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ మరొక వివాహం చేసుకున్నప్పటికీ.. రేణూ దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంటు తన పిల్లల బాగోగులు ,చదువులను మాత్రమే చూసుకుంటోంది. గతంలో కూడా ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి.ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన నెగెటివిటీతో రేణూ దేశాయ్ రెండో వివాహం చేసుకోవడానికి వీలు లేదంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చేశారు.
ఈ విషయంపైనే రేణూ దేశాయ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. నా జీవితం నా ఇష్టం మీరు ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా కౌంటర్ వేసింది. ఆ టాపిక్ కి చెక్ పడింది.. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒకరు ఈ విషయం పైన మళ్ళీ రేణూ దేశాయ్ కి కోపం తెప్పించేలా చేశారు.. ఒక అభిమాని"మిమ్మల్ని ఇంకా మేము పవన్ కళ్యాణ్ భార్యగా భావిస్తున్నాము మీ జీవితంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేయగా".
అందుకు రేణూ దేశాయ్ కూడా సీరియస్ గానే రిప్లై ఇస్తూ.. ఈ కామెంట్ చేసిన వ్యక్తి చదువుకున్నవాడే అనుకుంటున్నాను.. మనం 2025లో ఉన్నాము.. అయినప్పటికీ స్త్రీలు మాత్రం భర్త లేదా తండ్రి ఆస్తి అనే మనస్తత్వంతో ఇంకా సమాజంలో బలంగా నాటుకు పోతోంది.. ఇప్పటికీ మహిళలు చదువుకోవాలన్న, ఉద్యోగం చేయాలి అన్న పర్మిషన్ అడుగుతున్నారు.. మహిళలంటే వంట చేయడం పిల్లల్ని కనడం మాత్రమే అని భావించే మగవాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారు.. అలాంటి వాటికి తాను వ్యతిరేకం ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా భయపడను మహిళలు మార్పు తీసుకురావడమే నా ప్రయత్నం అంటూ రాసుకు వచ్చింది రేణూ దేశాయ్.