
దానికి కచ్చితమైన ఉదాహరణ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఆయన ఏ సినిమా చేసినా, ఏ పాట రిలీజ్ చేసినా ఒక బ్యాచ్ రెడీ గా ఉంటుంది. వాళ్లు వెంటనే “కాపీ రాజా” అని, “ఈ ట్యూన్ మునుపెప్పుడో తన సినిమాల్లో వాడేశాడు” అని, “అసలు హిట్ అయిన పాటలు కాపీ చేసేస్తున్నాడు” అని రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇటీవలే “ఓజీ” సినిమాలోని "సువ్వి సువ్వి" సాంగ్ పై కూడా ఇలాంటి ట్రోలింగ్ జరిగింది. “సవారి” సినిమాలో ఒక మెలోడియస్ పాట నుంచి కాపీ కొట్టేశాడని, దాన్నే కొత్తగా మార్చి సువ్వి సువ్వి చేశాడని ట్రోల్స్ చేశారు. కానీ థమన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తన పని తనకు తెలుసు అన్నట్టుగానే ముందుకు వెళ్ళిపోయాడు.
కానీ సేమ్ టైమ్‌లో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సాంగ్స్‌ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. “ఓజీ” మ్యూజికల్ హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. థమన్‌కి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సీన్ కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు సినిమాకి జరిగింది. గుంటూరు కారం సమయంలో మహేష్ అభిమానుల్లో కొందరు థమన్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. “అతను అసలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు”, “థమన్ ఉన్నంత వరకూ మన సినిమాకి మ్యూజిక్ డ్యామేజ్ అవుతుంది”, “ఆయనను తీసేయాలి” అంటూ ఘాటుగా మాట్లాడారు. కానీ చివరికి ఏం జరిగింది? గుంటూరు కారం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అంటే, ట్రోలింగ్ చేసిన వాళ్ల లాజిక్ పూర్తిగా తారుమారైపోయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర కూడా అదే రిపీట్ అవుతోంది. మొదట్లో థమన్‌పై ట్రోల్స్ వేసినా, ఇప్పుడు అదే అభిమానులు ఆయన మ్యూజిక్‌ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక చర్చ జోరుగా నడుస్తోంది—“గుడ్డిగా ఎవరు ట్రోల్ చేస్తే వాళ్లని ఫాలో అవ్వకండి. నిజాలు తెలుసుకోకుండా కేవలం హేటర్స్ మాటలు నమ్మి ముందుకు వెళ్లకండి” అని చాలా మంది హెచ్చరిస్తున్నారు. ఇండస్ట్రీ మనకి ఇస్తున్న గుణపాఠం కూడా ఇదే. స్టార్ హీరోల అభిమానులు కూడా కొంచెం కూల్‌గా, బ్రెయిన్ పెట్టుకొని ఆలోచించి, నిజం ఏంటి అనేది తెలుసుకొని ముందుకు వెళితే మంచిదని ఓ పెద్ద వర్గం ఘాటుగా చెప్పేస్తోంది.