
ఇటీవలె హైదరాబాద్ నుంచి మంచు లక్ష్మి ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడ కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే మంచు లక్ష్మి ముంబైకి షిఫ్ట్ అయ్యాక ఓ వార్త నెట్టింట బాగా సర్క్యూలేట్ అయింది. మంచు లక్ష్మి అప్పుల్లో కూరుకుపోయిందని.. హైదరాబాద్ లో ఆమెకు ఉన్న ఇంటిని కూడా అమ్మకానికి పెట్టిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై తాజాగా మంచు లక్ష్మి రియాక్ట్ అయింది. తన అప్ కమింగ్ ఫిల్మ్ `దక్ష` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి.. తన ఆర్థిక పరిస్థితి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
`నాకు అప్పులు ఉన్నాయని.. వాటిని కట్టడానికి హైదరాబాద్‌లోని ఇంటిని అమ్మకానికి పెట్టానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. వాస్తవానికి హైదరాబాద్ లో నాకుఇల్లే లేదు. ఫిలిం నగర్ లో ఉన్న ఇల్లు నాది కాదు. ఆ ఆస్తి మా నాన్న సొంతం. నేను ఉండడానికి ఆ ఇంటిని ఇచ్చారు అంతే. ఇక నా ఇష్టం ప్రకారమే నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఇంటి రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నా ఉన్నంతలోనే సరిపెట్టుకుంటున్నాను. కానీ, డబ్బు సాయం చేయమని మాత్రం నాన్నను అడగలేదు. సినిమాలు, షోల ద్వారా వచ్చిన డబ్బుతోనే ముందుకు వెళుతున్నాను` అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, తండ్రి మోహన్ బాబు, అన్నలు విష్ణు-మనోజ్ సినీ ఇండస్ట్రీలో బలమైన స్థానం సంపాదించుకున్నారు. భర్త ఆండీ శ్రీనివాసన్ కూడా ప్రొఫెషనల్ గా హై ఎండ్స్ లో ఉన్నారు. అయినప్పటికీ వారి సంపదపై ఆధారపడకుండా, తనకు వచ్చిన అవకాశాలు తన సంపాదన ద్వారానే మంచు లక్ష్మి జీవనం సాగించడం గమనించదగ్గది.