ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్‌ బలంగా కనిపిస్తోంది. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు కూడా విలన్ షేడ్స్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒకప్పుడు హీరో ఇమేజ్‌కి భంగం కలగకుండా జాగ్రత్త పడిన స్టార్స్, ఇప్పుడు మాత్రం విభిన్నమైన పాత్రలు చేసి తమ నటనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంతో పెద్ద స్టార్స్  నెగిటివ్ షేడ్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జగపతి బాబు, నాగార్జున, మంచు మనోజ్ వంటి హీరోలు విలన్ పాత్రల్లో మెప్పించారు. ప్రత్యేకంగా మంచు మనోజ్ ఇటీవల విడుదలైన "మిరాయి" సినిమాలో కనిపించిన నెగిటివ్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు కూడా హీరోలను ఒక్క కోణంలో కాకుండా, విభిన్నమైన రోల్స్‌లో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇండస్ట్రీలో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని, హీరోలు తమ ఇమేజ్‌ని కేవలం హీరోగా మాత్రమే పరిమితం చేసుకోకుండా, వేరే వేరే షేడ్స్‌ను కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. "ఇండస్ట్రీలో తరువాత ఎవరు విలన్‌గా నటించబోతున్నారు?" అన్న ప్రశ్న వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగాస్టార్ చిరంజీవిదే. ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది – స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌కి తండ్రి పాత్రలో చిరంజీవి కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రెండవది – నాగార్జున నటించిన కుబేర సినిమా చూసిన తర్వాత స్వయానా చిరంజీవి కూడా, “ఇలాంటి రోల్ వస్తే నేను తప్పకుండా చేస్తాను” అని చెప్పాడన్న వార్తలు బయటకు రావడం.



ఈ రెండు కారణాల వలన సోషల్ మీడియాలో ప్రస్తుతం బిగ్ డిస్కషన్ నడుస్తోంది. “మెగాస్టార్ చిరంజీవి తనలోని నెగిటివ్ యాంగిల్ ని బయటకు తీయబోతున్నాడా?” అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూడాలి మరి – మెగాస్టార్ చిరంజీవి నిజంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే, ఆయన తన విలన్ ఇమేజ్‌ని ఎలాంటి స్టైల్లో ప్రదర్శిస్తాడో..? ఎంత వరకు అభిమానులను ఆకట్టుకుంటాడో..? అయితే ఒక్క విషయం మాత్రం ఖాయం – ఈ నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీలో మళ్లీ ఒక పెద్ద ట్రెండ్ సెట్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: