తమిళ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ జోష్లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల రేంజ్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. స్టార్ హీరోలు నటించిన సినిమాలకు హిట్టు ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక స్టార్ హీరోలు నటించిన సినిమాలకు హిట్ టాక్ గనక వచ్చినట్లయితే ఆ మూవీలకు బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ కూడా ఇలాంటి స్థాయి లోనే కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

శివ కార్తికేయన్ నటించిన సినిమాలకు కూడా హిట్ , ఫ్లాప్ టాక్ సంబంధం లేకుండా తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇక ఆయన నటించిన సినిమాలకు మంచి టాక్ గనుక వచ్చినట్లయితే అద్భుతమైన కలెక్షన్లు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. తాజాగా శివ కార్తికేయన్ ,  ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది.

ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు చాలా ప్రాంతాల్లో కలెక్షన్లు పడిపోయాయి. తమిళ బాక్సా ఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయినా కూడా ఈ మూవీ కి ఓవరాల్ గా పది రోజుల్లో అద్భుతమైన కలెక్షన్లు కోలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర దక్కినట్లు తెలుస్తోంది. పది రోజుల్లో ఈ సినిమాకు తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర 58 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. దీనితోనే అర్థం అవుతుంది కోలీవుడ్ ఇండస్ట్రీ లో శివ కార్తికేయన్ కు ఏ స్థాయి క్రేజ్ ఉంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk