"టైం బాగోలేకపోతే అరటిపండు తిన్న పన్ను విరిగిపోతుంది" అనే  ఓ బిగ్ తెలుగు ఫన్నీ సామెత అందరికీ గుర్తే ఉంటుంది. చాలా మంది పెద్ద వాళ్ళు ఇది పలు సంధర్భాలల్లో మాట్లాడుతూ ఉంటారు. అదే సామెతలా ఇప్పుడు హీరోయిన్ రాశి ఖన్నాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. దానికి కారణం—ఆమె ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే."అదేంటి, పవన్ కళ్యాణ్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోకూడదా? ఆమె ఒక హీరోయిన్ కదా?" అని కొందరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం వేరే. రాశి ఖన్నా ఒకప్పుడు ఆ ఇంటికి కోడలు అయ్యే అవకాశముందని, మామ అని పిలవాల్సిన హీరోతోనే ఇప్పుడు లవర్‌గా నటిస్తోందని జనాలు చర్చించుకోవడం వల్లే ఇది హాట్ టాపిక్‌గా మారింది.


రాశి ఖన్నా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా పెద్దగా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందలేకపోయింది. కానీ వరుణ్ తేజ్ నటించిన "తొలిప్రేమ" సినిమా ఆమెకు మంచి సక్సెస్ ఇచ్చింది. ఆ సినిమాలో వరుణ్–రాశి ఖన్నా కెమిస్ట్రీ హైలైట్‌గా మారింది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాక, కొంతమంది "రాశి ఖన్నా మెగా ఇంటి కోడలు కాబోతుంది" అంటూ కూడా రాశారు. కానీ తరువాత ఆ వార్తలు ఫేక్ అని తేలిపోయాయి. అయితే కొంతమంది మాత్రం "వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారు, కానీ మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు" అని అనుకున్నారు. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని, రాశి ఖన్నా చేసే పనులు ఆయనకి నచ్చకపోవడం, మెగా ఫ్యామిలీ ఇమేజ్ దెబ్బతినవచ్చనే కారణంతో రిజెక్ట్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.



ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమించి, చిరంజీవి ఒప్పుకొని ఉంటే రాశి ఖన్నా ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయ్యి ఉండేదేమో..?  ఆ స్థానంలో లావణ్య త్రిపాఠి కాకుండా ఆమె ఉండేదేమో..?  అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు.మొత్తానికి రాశి ఖన్నా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్‌తో ఓజీ సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. ఫ్యాన్స్ మాత్రం ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. చూడాలి మరి రాశీ-పవన్ పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో..???

మరింత సమాచారం తెలుసుకోండి: