
ముఖ్యంగా హాస్య పాత్రల్లో రమాప్రభకు ఉన్న టైమింగ్ అద్భుతం. రేలంగి, పండరి బాయ్, అల్లు రామలింగయ్య తర్వాత తెలుగు సినిమా హాస్యనటుల సంప్రదాయాన్ని కొనసాగించిన వారిలో రమాప్రభ ఒకరు. అయితే గత కొన్నేళ్ల నుంచి సినీ రంగంలో చురుకుగా లేకపోయినా, అప్పుడప్పుడు టెలివిజన్ షోలు, సినీ వేడుకల్లో పాల్గొంటూ కనిపిస్తారు. ఇకపోతే రమాప్రభా వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. రమాప్రభా తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో నటుడు శరత్ బాబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత వ్యక్తిగత బంధంగా, ఆపై పెళ్లిగా మారింది.
కానీ శరత్ బాబు, రమాప్రభల బంధం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన 14 ఏళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం శరత్ బాబు మరొక వివాహం చేసుకోగా.. రమాప్రభ మాత్రం ఒంటరి జీవితాన్నే సాగిస్తోంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. రమాప్రభ అల్లుడు ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో, ఇప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నాడు. ఇంతకీ ఆయన మరెవరో కాదు నటకిరీటి రాజేంద్రప్రసాద్.
నిజానికి రమాప్రభకు సంతానం లేరు. కానీ ఆమె తన చెల్లెలి కూతురు విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. విజయ చాముండేశ్వరి మరెవరో కాదు రాజేంద్రప్రసాద్ సతీమణి. రమాప్రభ తన దత్త కూతుర్ని ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అలా రమాప్రభ, రాజేంద్రప్రసాద్ మధ్య దగ్గరి బంధుత్వం ఏర్పడింది.