టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాని ఈ మధ్య కాలంలో తనకు మంచి విజయాలను అందించిన దర్శకులతో వరుస పెట్టి సినిమాలను చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా రెండు సినిమాలను చేశాడు. నాని , వివేక్ ఆత్రయ కాంబో లో మొదటగా అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే నాని కొంత కాలం క్రితం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమాలో హీరో గా నటించిన మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాని కి హాయ్ నాన్న అనే సినిమాతో శౌర్యవ్ అనే దర్శకుడు మంచి విజయాన్ని అందించిన విషయం మనకు తెలిసిందే. మరోసారి నాని , శౌర్యవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాని కోసం శౌర్యవ్ ఓ కథను రెడీ చేసినట్లు , దానిని నాని కి వినిపించగా ఆయనకు కూడా ఆ స్టోరీ నచ్చడంతో నాని , శౌర్యవ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నాని తో ఈ సారి శౌర్యవ్ పిరియాడిక్ డ్రామా ను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: