పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటీంచిన సినిమా ఓజీ. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది సుజిత్. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి, ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24న రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు.ఇప్పటికే టికెట్ల అమ్మకాల స్థితి చూస్తే అభిమానుల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. క్షణాల్లోనే అన్ని షోలు సాల్డ్ అవుట్ కావడం అభిమానుల ఎగ్జైట్‌మెంట్‌ని స్పష్టంగా చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలిసిన దగ్గరనుంచే ఫ్యాన్స్‌లో హైప్ మరింత పెరిగింది. ఇప్పటి వరకు సినిమా ట్రైలర్ రిలీజ్ కాకపోయినా సోషల్ మీడియాలో అభిమానులు చేస్తున్న హంగామా మాత్రం మామూలుగా లేదు. ఎక్కడ చూసినా "ఓజీ...ఓజీ..." అంటూ రచ్చ రంబోలా చేస్తున్నారు.

ఇంతటి అంచనాలు ఉన్నా కూడా, సినిమా రిలీజ్‌కి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా పెద్ద ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడం కొంతమందికి నెగిటివ్ టాక్‌లా అనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటమే దీని కారణమని, అందుకే ఈసారి ప్రమోషన్స్‌ని చాలా లైట్‌గా, సింపుల్‌గా ప్లాన్ చేశారని సమాచారం.ఇక అసలైన బిగ్ సర్ప్రైజ్ సంగతి ఏంటంటే – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఓజీ టీమ్ ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఇంటర్వ్యూకి రెడీ అవుతోంది. ఆ ఇంటర్వ్యూ చేస్తోందెవరో తెలుసా? ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి!

మెగా అభిమానులు ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్చిరంజీవి ఇద్దరినీ ఒకే తెరపై చూడాలని ఆశపడుతున్నారు. ఆ కల కల్లలాగే మిగిలిపోయినా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రూపంలో ఆ కోరిక నెరవేరబోతోంది. అన్నయ్య – తమ్ముడు ఇద్దరూ ఒకే వేదికపై కూర్చొని మాట్లాడుతుండటం అభిమానులకు పండుగే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కెరీర్, ఆయన వ్యక్తిగత లక్షణాలు, అభిమానులపై ఆయనకున్న అనుభూతులు అన్నీ బయటపడే అవకాశం ఉందని ఇప్పటికే ఫ్యాన్స్ ఉత్సాహంగా చెబుతున్నారు. ఈ ఇంటర్వ్యూని కేవలం ఓజీ ప్రమోషన్‌గా మాత్రమే కాకుండా, ఒక ఎమోషనల్ మోమెంట్‌గా కూడా గుర్తుంచుకుంటారని అభిమానులు అంటున్నారు. అన్నయ్య చిరంజీవి ప్రశ్నిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇచ్చే సమాధానాలు మాత్రం వేరే లెవెల్‌లో ఉండే అవకాశం ఉంది. నిజంగానే ఈ ఇంటర్వ్యూ ఎంత గ్రాండ్‌గా, ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో చూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: