
ఇప్పటికే అమెరికాలో ఈ వీసా పైన ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు అంటూ తెలియజేశారు. అమెరికా బయట నుంచి ఎవరైతే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలియజేశారు. పలు రకాల ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కూడా వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సి ఉందంటూ హెచ్చరించారు. ట్రంప్ విధించిన నిర్ణయం పైన అమితాబ్ కాంత్ తన ట్విట్టర్ ద్వారా అమెరికాలో ఆవిష్కరణలను దెబ్బతీసి ,భారత అభివృద్ధిని మరింత వేగవంతంగా చేసేలా ఉందంటూ తెలియజేశారు.
ప్రపంచ స్థాయి ప్రతిభలకు ద్వారాలు మూసివేయడం ద్వారా అమెరికా తర్వాతి తరం ల్యాబ్, ఆవిష్కరణలు, స్టార్టాప్ బెంగళూరు, పెంటెంట్లు , హైదరాబాద్, పూణే ఇతరత్ర ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే భారతదేశంలో అత్యుత్తమ ఇంజనీర్లు ,వైద్యులు, శాస్త్రవేత్తలు, వికసిత భారత్ కలను సహకారం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశం గా మారబోతోందని తెలియజేశారు. వీసాల పైన విధించినటువంటి ఈ నిర్ణయం అమెరికాకే నష్టం చేకూరుతుందంటూ అమితాబ్ కాంత్ క్లారిటీగా ఇచ్చేశారు. GOOGLE, ఇన్ఫోసిస్ ,మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయని తెలియజేశారు.