పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా రేపటి రోజున భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. ఇటీవలే ఓజి చిత్రానికి ఏర్పడినంత హైప్ మరే సినిమాకి ఏర్పడలేదు. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆదివారం రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తీరు, ఆయన మాట్లాడిన తీరు చూసి ఆ అభిమానులే ఆశ్చర్యపోయారు. సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే ఓపెనింగ్స్ పరంగా కూడా బుకింగ్స్ భారీగానే బుకింగ్ అయినట్లుగా తెలుస్తున్నాయి.


ఓజి సినిమా టికెట్లు కూడా హాట్ కేకుల అమ్ముడుపోయాయి. తాజాగా  పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా థియేటర్ల వద్ద చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా థియేటర్ల వద్ద కటౌట్స్, బ్యానర్స్ లకు పాలాభిషేకాలతో నానా హంగామ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్ల దగ్గర చేస్తున్న హంగామాకు సంబంధించి  వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్  గా చేస్తున్నారు ఫ్యాన్స్.. ఈ వీడియోలో ప్రకారం హైదరాబాదులో మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి భారీ పూలమాల వేసి మరి క్రాకర్స్ తో చాలా గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.



ఇక ఈ రోజున అభిమానులు కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ వద్దకు భారీగానే తరలివచ్చే అవకాశం ఉన్నట్లు "HYD S FAV HERO" అంటూ నానా హంగామా సృష్టిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఓజి సినిమా మ్యూజిక్ తో హైలెట్ చేస్తున్నారు. సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, వెన్నెల కిషోర్ తదితర నటీనటులు నటిస్తున్నారు. మొత్తానికి రిలీజ్ ముందే అభిమానులు చేస్తున్న హంగామా కి తోడుగా ఇక సినిమా విడుదలై సక్సెస్ అయితే  ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: