టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం OG. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ రోజున ఈ సినిమా విడుదలై థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తోంది. సినిమా చూసిన అభిమానులు, ఆడియన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 2వ స్ట్రైట్ సినిమా కావడంతో చేత ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే OG సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.



OG సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, ఇమ్రాన్ హస్మి యాక్టింగ్ అద్భుతంగా ఉంది, 1980 బ్యాక్ డ్రాప్ లో ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కళ్యాణ్ ను చూపించిన తీరు అభిమానుల చేత థియేటర్లో ఈలలు వేయించేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇందులో నటించిన ప్రియాంక మోహన్.. పవన్ కళ్యాణ్ భార్యగా  కూడా క్యూట్ లుక్స్ అందరిని ఆకట్టుకుంది. శ్రియా రెడ్డి పాత్ర తక్కువగా ఉన్నా.. అద్భుతంగానే నటించింది. సినిమా అంతటికి కూడా పవన్ కళ్యాణ్ హైలెట్ గా నిలుస్తూ..  తన కాస్ట్యూమ్స్ డిజైనర్ తో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా మొత్తం జపాన్, ముంబై బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కించారు.


సినిమా హిట్ టాక్ రావడంతో అభిమానులు సైతం థియేటర్ల వద్ద నానా హంగామా సృష్టిస్తున్నారు.  ముఖ్యంగా ఒక అభిమాని అనంతపురంలో థియేటర్ల వద్ద సంబరాలు శృతి మించినట్టుగా కనిపిస్తున్నాయి. ఏకంగా బ్లేడుతో తన చెయ్యి కోసుకుని మరీ రక్తంతో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి తిలకం దిద్దిన ఘటన వైరల్ గా మారుతోంది. ఈ విషయం విన్న పలువురు నెటిజన్స్ మాత్రం ఏంటి అభిమానం ఉండవచ్చు కానీ మరీ ఇలా చేయడం దారణమంటూ ఫైర్ అవుతున్నారు.  రక్తహీనతతో బాధపడే వారికి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు కదా అంటూ మరికొంతమంది సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: