
ఈ మొదటి ఎపిసోడ్ లో భాగంగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ గెస్ట్లు గా హాజరయ్యారు. అలాగే గతంలో సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో ఉన్న రిలేషన్స్ పైన కూడా అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేశారు. ముఖ్యంగా తాను చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను కానీ ఆ సంబంధాలు ఎక్కువ రోజులు కొనసాగించలేకపోవడానికి తన తప్పే కారణమంటూ తెలిపారు. ఈ విషయంలో నేను నన్ను నిందించుకుంటాను అంటూ తెలియజేశారు సల్మాన్ ఖాన్.
అంతేకాకుండా ఊహించని రీతిలో మాట్లాడారు .. తాను ఏదో ఒక రోజు పిల్లలని కణాలనుకుంటున్నాను? చివరికి ఎవరు భార్య గా వస్తారో!తనని నాన్న అనిపించుకునే అవకాశం ఎవరికి లభిస్తుందో చూడాలి అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు సల్మాన్ ఖాన్. అలాగే బంధంలో ఒకరికొకరు మించి ఎదిగితేనే సమస్యలు మొదలైతాయని..ఇద్దరు కలిసి ఎదిగితే ఎలాంటి బంధమైన సరే బలంగా ఉంటుందంటూ సల్మాన్ ఖాన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే ఈ షో సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. సల్మాన్, అమీర్ ఖాన్ తో మొదలైన ఈ షో ఆ తర్వాత ఎపిసోడ్లో చంకీ పాండే- గోవిందా, జాన్వీ కపూర్- కరణ్ జోహార్, వరుణ్ ధావన్ -ఆలియా భట్ జంటలుగా కనిపించేలా ప్లాన్ చేశారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ గా మారుతున్నాయి.